వన్‌టౌన్: ఏపీ రెవెన్యూ సేవల సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకూ మూడురోజుల పాటు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.నాగేశ్వరరెడ్డి, సి.చంద్రశేఖరరావు తెలిపారు. పాడేరు, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లతో పాటు కలెక్టరేట్ యూనిట్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారన్నారు. 10న పోలీసు స్టేడియం ఆవరణలో 100, 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్‌పుట్, జావెలిన్‌త్రో తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు. 11, 12 తేదీల్లో ఓడరేవు మైదానంలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, షటిల్, టేబుల్‌టెన్నిస్, క్యారమ్స్, చదరంగం తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు. పురుష, మహిళా ఉద్యోగులకు వేరువేరుగా పోటీలు ఉంటాయన్నారు. రెవెన్యూ ఉద్యోగులంతా పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని, ఈనెల 12న పోటీల ముగింపు సభ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సాయంత్రం 4.30 గంటలకు జరుగుతుందని, ఆ వేదికపై విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment