వన్‌టౌన్: రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటాశ్రీనివాసరావులు జిల్లా ప్రజలకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలు సుఖసంతోషాలతో, పాడి పంటలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకలను జిల్లా స్థాయిలో శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఉదయం 9గంటలకు పంచాంగ శ్రవణంతో వేడుకలు మొదలవుతాయని, తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. పండితులు, సాహితీ వేత్తలు, కళాకారులను ఉగాది పురస్కారాలతో సత్కరిస్తామన్నారు.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment