విశాఖ: ఈ నెల 11న విశాఖ న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్.వి.సుమన్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం సాధారణ సభ్యుల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు న్యాయవాది పలివెల దత్తాత్రేయరామానందరాయలు సోమవారం దారుణహత్యకు గురయ్యారని, దీనికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బార్‌కౌన్సిల్ సభ్యుడు ఎస్.కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి సనపల నరసింహస్వామి మాట్లాడుతూ కేసును సీబీఐకి బదలాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు ప్రసంగించారు.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment