శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి తిరు వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సింహగిరిపై పెళ్లిరాట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తొలుత ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామికి ఉగాది పచ్చడి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చేతులు మీదుగా ఉగాది పురస్కారాలు అందజేయనున్నారు.
అప్పన్న తిరువీధి ఉత్సవం
సింహగిరిపై కొత్త అమావాస్యను పురస్కరించుకుని గురువారం అప్పన్నస్వామి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామిని ప్రత్యేకంగాఅలంకరించి పల్లకీలో వూరేగించారు. దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి విశాఖ జిల్లా వడ్లపూడికి చెందిన విజ్ఞాన్ విశ్వ విద్యాలయం ఛైర్మన్ లావు రత్తయ్య రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారి ప్రసాద్‌కు అందజేశారు.
0 comments:
Post a Comment